ముంబైలోని రూ.3,700 కోట్ల అనిల్ అంబానీ ఇంటిని అటాచ్ చేసిన ఈడీ

  • పాల్ హిల్ నివాస ఆస్తిని తాత్కాలికంగా జప్తు చేసిన ఈడీ
  • 17 అంతస్తులతో 66 మీటర్ల ఎత్తు ఉన్న విలాసవంత భవనం
  • ఇప్పటి వరకు అటాచ్ చేసిన ఆస్తుల విలువ రూ.15,700 కోట్లు
రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్.కామ్.) బ్యాంకు మోసం కేసుకు సంబంధించి ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి చెందిన రూ.3,716.83 కోట్ల విలువైన పాలి హిల్ నివాస ఆస్తిని ఈడీ బుధవారం తాత్కాలికంగా జప్తు చేసింది. 17 అంతస్తులతో 66 మీటర్ల ఎత్తు ఉన్న ఈ విలాసవంతమైన ఇంటి విలువ రూ.3,716 కోట్లు ఉంటుందని అంచనా. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

అనిల్ గ్రూప్ కంపెనీలు కోట్లాది రూపాయల బ్యాంకు రుణాల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. రిలయన్స్ కమ్యూనికేషన్స్‌తో సంబంధం ఉన్న ఈ కేసులో భాగంగా ఆ ఇంటిని ఈడీ అటాచ్ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

గతంలో ముంబైలోని రూ.473.17 కోట్ల విలువైన ఆస్తిని కూడా ఈడీ అటాచ్ చేసింది. ఈ కేసుతో ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల విలువ రూ.15,700 కోట్లకు చేరింది. ఆర్.కామ్., దాని అనుబంధ సంస్థలు దేశీ, విదేశీ రుణదాతల నుంచి తీసుకున్న మొత్తంలో రూ.40,185 కోట్ల బకాయిలు ఉన్నాయి.

Anil Ambani
Reliance Communications
RCom
ED
Enforcement Directorate
Money Laundering

More Telugu News